దుర్గా నవరాత్రుల ఉత్సవాలను వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో

అమరావతి కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రుల ఉత్సవాలను యునెస్కో,, వారసత్వ జాబితాలో చేర్చింది..ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు..దుర్గాపూజను సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడంపై మమతాఆనందం వ్యక్తం చేశారు..దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే గుర్తు వచ్చేది పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతా..నవరాత్రుల సమయంలో ఇక్కడ కాళీ మాత మండపాలు భారీగా దర్శనమిస్తుంటాయి..కోల్‌కతా అనే పదం, బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి వచ్చింది. కాలిక్ క్షేత్ర అంటే కాళికా దేవి కొలువైన స్థలం అని అర్థం..అలాగే కాళీ ఘాట్ పదం నుంచి కోల్‌కతా అనే పేరు వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కోల్‌కతాలోని కాళీ ఘాట్ కాళీ దేవి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది..
#WATCH | Kolkata, West Bengal: CM Mamata Banerjee takes out a rally thanking UNESCO for putting Durga Puja on the intangible cultural heritage representative list pic.twitter.com/Wj5omF8QS7
— ANI (@ANI) September 1, 2022