x
Close
AMARAVATHI DEVOTIONAL

సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 5వ తేది వరకూ దసరా ఉత్సవాలు-ఈవో

సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 5వ తేది వరకూ దసరా ఉత్సవాలు-ఈవో
  • PublishedSeptember 1, 2022

అమరావతి: దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 5వ తేది వరకూ నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో భ్రమరాంబ వెల్లడించారు..10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే ఉత్సవాల్లో పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు..ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబరు 2వ తేది మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారిని దర్శించుకుంటారన్నారు..ఈ సంవత్సరం నెల రోజుల నుంచి అన్ని విభాగలను సమన్వయం చేసుకుంటు భక్తులకు సౌకర్యలు ఏర్పట్లు చేస్తున్నమన్నారు.అలాగే ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయని, ఇందులో భాగంగా రూ.80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేపడుతున్నామన్నారు..భక్తుల కోసం చండిహోమం, శ్రీ చక్ర నామార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు చేస్తున్నామని,,కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టికెట్లు ఆన్ లైన్ లో ఉంచామన్నారు..గతంలో లాగానే నగరోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలని,,మాల వితరణకు అవకాశం లేదన్నారు..ఈ సంవత్సరం కూడా అంతరాలయ దర్శనాలు లేవని స్పష్టం చేశారు..కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు..భక్తులకు రూ.100, రూ.300, ఉచిత దర్శనాలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాల ప్రతిపాదనలపై,,త్వరలో జరిగే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు..6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు,,తిరుపతి శ్రీవారి లడ్డు నాణ్యత,రుచి కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు.. మొత్తం 21 లక్షల లడ్డూలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని,,అలాగే దర్శనానికి వచ్చే భక్తులకు సాంబారు, పెరుగన్నం, బెల్లం పొంగలి అందిస్తామన్నారు..గత సంవత్సరం రూ.9.50 కోట్లు ఆదాయం రాగా రూ.3 కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పారు..ఈ ఏడాది రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయడం జరుగుతోందని,,భక్తుల సౌకర్యాల కోసం రూ.5 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *