తైవాన్ లో భూకంపం,6.8గా రిక్టర్ స్కేలుపై నమోదు-భారీగా ఆస్తి నష్టం

అమరావతి: భారీ భూకంపం ధాటీకి తైవాన్ కంపించింది..యూలి పట్టణంకు సమీపంలో 6.8 తీవ్రతతో భూమి కంపించడంతో పెద్ద పెద్ద భవనాలు,,అపార్ట్ మెంట్లు థ్వసం అయ్యాయి..భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.44 గంటలకు భూకంపం వచ్చినట్లు తైవాన్ వాతావరణశాఖ ప్రకటించింది..శనివారం ఇదే ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపించింది..భూమికి 10 కీ.మీ లోతున భూమి కంపించినట్లు, దినీ తీవ్రత 7.2 గా రిక్టర్ స్కేలుపై నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది..భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంపం ధాటికీ భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు..రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భారీ భూకంపం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి..మరో చోట వంతెన కూలిపోయింది. తైవాన్ రైల్వే శాఖ హువాలియన్, టైటుంగ్ ల మధ్య ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.తైవాన్ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది.
Another video of a bridge in #Hualien twisted up and dumped on one side.
7.2-magnitude #earthquake strikes off east cost of #Taiwan: USGSpic.twitter.com/HJHFEn3VBi— Chaudhary Parvez (@ChaudharyParvez) September 18, 2022