CRIMENATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మళ్లీ సోదాలు చేస్తున్న ఈడీ

ఢిల్లీ, పంజాబ్,హైదరాబాద్….

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సదరు రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్కు సంబంధించి పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండుచోట్ల సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు దాడులు చేస్తుండగా, ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిపై FIR కూడా దాఖలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఢిల్లీకి చెందిన పలువురు అధికారులను నిందితులుగా పేర్కొంటూ మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రను గత వారమే అరెస్ట్ చేసింది. 

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ మద్యం పాలసీ విధివిధానలను మార్చడం ద్వారా వేల కోట్ల అవినితి జరిగిందని,పలువురు మద్యం సిండికేట్ కు సంబంధించిన వ్యాపారస్తులు ఆరోపించడంతో, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.ఈ సంవత్సరం జూలైలో, కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మద్యం పాలసీని రద్దు చేసి,కొత్త మద్యం పాలసీని ఆమల్లోకి తెచ్చింది. ఈ కేసులో సంబంధం ఉన్న 11 మంది ఎక్సైజ్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *