మనీలాండరింగ్ కేసులో యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను సీజ్ చేసిన ఈడీ

అమరావతి: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈఢీ సీజ్ చేసింది.. మంగళవారం ఉదయం నుంచి దిల్లీ, లఖ్‌నవూ, కోల్‌కతాలో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు,,నేటి (బుధవారం) సాయంత్రం యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను సీజ్ చేస్తున్నట్లు,, తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేసింది..కేసు పూర్వపరాలు:- కాంగ్రెస్‌కు, నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు..ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా 7గురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు..కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు ప్రయత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు..ఈ కేసులో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌లను ఈడీ ప్రశ్నించింది..మరణించిన వోరాకు తెలుసు:- నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా,,అవన్నీ మోతీలాల్ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.(2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు).