DISTRICTS

రేపటి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ ఎ.సి బస్సులు

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితాన్ని పాటించాలని తిరుపతి, తిరుమలలో విద్యుత్ బస్సులు  (ఎ.సి) ప్రయాణికుల కోసం 100 బస్సులను అందుబాటులోకి  తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తిరుపతి, తిరుమల దేవస్థానంల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం సీ.ఎం జగన్,అలిపిరి వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 10 బస్సులను ప్రారంభించనున్నారని తిరుపతి కలెక్టర్ వెంకటరమణరెడ్డి తెలిపారు. ఒక్కొక్క బస్సు 35 మంది ప్రయాణికులతో ఒకసారి చార్జ్ చేస్తే 180 కి.మీ ల ప్రయాణం, LED డిస్ప్లే,CCTV కమెరాలు, వై.ఫై. సౌకర్యం,GPS ట్రాకింగ్, లగేజ్ ర్యాక్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి.ఈ బస్సుల కోసం అలిపిరి డి.పో ను పూర్తిగా విద్యుత్ బస్సులకు కేటాయిస్తూ చార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటు చేశారు. తిరుపతి – తిరుమల మధ్య 50, తిరుపతి – రేణిగుంట ఎయిర్పోర్ట్ 14, తిరుపతి – మదనపల్లి 12, తిరుపతి – కడప 12, తిరుపతి – నెల్లూరు 12  బస్సులను ఆర్.టి.సి నడపనున్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *