ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు అవిష్కరించిన-కేంద్ర మంత్రి గఢ్కరీ

అమరావతి: ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు రంగప్రవేశంతో రవాణా రంగం సుస్థిర అభివృద్ధికి ఈ ఆవిష్కరణ దోహదపడడంతో పాటు వల్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా తక్కువ ఖర్చుతో రవాణా సాధ్యమవుతుందని కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు..గురువారం ముంబయిలో స్విచ్ మొబిలిటీ సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ప్రవేశపెట్టిన సందర్బంలో గఢ్కరీ ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..అశోక్ లేల్యాండ్ కు చెందిన ఈ సంస్థ EIV 22 పేరిట ఈ బస్సును లాంచ్ చేసింది..నగర రవాణాకు అనుగుణంగా బస్సును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది..ఈ బస్సు ఆధునిక డిజైన్, అత్యున్నత భద్రత, బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్ ఫీచర్లను కలిగివుంది..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇప్పటికే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ 200 బస్సుల కోసం ఆర్డర్ చేసిందని కంపెనీ పేర్కొంది..ఈ సంవత్సరం 50 బస్సులను ముంబయికి డెలివరి చేస్తామని,,వచ్చే సంవత్సరం 150 నుంచి 250 వరకు డెలివరీ చేస్తామని ప్రకటించింది..