పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో యువతకు ఉపాధి అవకాశాలు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో పాటు మత్స్యకారులకు సుస్థిర ఆదాయం కలుగుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు..మంగళవారం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే సేకరించిన 78 ఎకరాలలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు పూర్తిచేసి త్వరలోనే సీ.ఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తో జిల్లాలోని ప్రజలకు మెరుగైన ఉపాధి కల్పనతో పాటు తీర ప్రాంత మత్స్యకారులకు సుస్థిర ఆదాయం కలుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పోర్టులు, హార్బర్ ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. నిర్దేశించిన సమయానికి పూర్తయ్యలా ప్రణాళిక రచించుకొని, అందుకనుగుణంగా పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా స్థానిక మత్స్యకారులు లేవనెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రసిద్ద ఐ ఐ టి రీసెర్చ్ నిపుణులతో సాంకేతికంగా పరిశీలన జరిపిస్తామని తెలిపారు. అదేవిధంగా పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని, హార్బర్ కు రాకపోకలకు రోడ్డు నిర్మాణం నకు, ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరలోనే చేపడతామన్నారు.