INTERNATIONALOTEHRS

కరోనా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ శకం ముగిసింది-టెడ్రోస్

అమరావతి: కరోనా వైరస్ కారణంగా గడచిన మూడు సంవత్సరాలుగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలిగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం ప్రకటన చేసింది..ప్రపంచ ఆరోగ్య సమస్యలపై మీడియా సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ కోవిడ్ అత్యవసర దశ ముగిసిందని, అయితే మహమ్మారి మాత్రం అంతం కాలేదని అన్నారు..1,221 రోజుల క్రితం, చైనాలోని వుహాన్‌లో తెలియని కారణంతో కొన్ని కొత్త రకం కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ తెలిపారు..జనవరి 30, 2020న అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమావేశమైన ఎమర్జెన్సీ కమిటీ సలహా మేరకు కరోనా వ్యాప్తిపై ఆందోళన చెంది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించామని ఆయన తెలిపారు..సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా కేసులు,  మరణాలు కూడా తగ్గాయన్నారు..దీంతో వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గిందన్నారు.. మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగిందంటూ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *