ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల డ్యాం వున్నప్పటికి ఇప్పటికి మెట్ట భూములు? జనసేన-శ్రీధర్

నెల్లూరు: దాదాపు 80 టీ.ఎం.సీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎక్కువ భాగం భూములు మెట్ట భూములుగానే ఉండడానికి కారణం ఏమిటంటూ జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి.శ్రీధర్ ప్రశ్నించారు.గురువారం 12వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జ్యోతి నగర్ మరియు వీవర్స్ కాలనీలో పర్యటించిన సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉన్నప్పటికీ, నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీటి సౌకర్యం కల్పించేది ఎప్పుడు అంటు పాలకులను నిలదీశారు. సోమశిల జలాశయం నుంచి పక్క రాష్ట్రమైన తమిళనాడుకు,, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు,,నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి సాగు,తాగు నీటి వసతులు కల్పించరన్నారు.అయితే నియోజకవర్గంలోని సింహభాగం భూములకు ఇప్పటికీ సాగునీరు లభించేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదని,, రూపొందించిన వాటికి నిధులను మంజూరు చేయని కారణంగా అవి మూలనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు,, గ్రామాలకు సాగు,తాగు నీటి సదుపాయాలు కల్పించాలంటే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి గల జనసేన పార్టీకే మద్దతు ఇవ్వలని అభ్యర్దించారు.మునిసిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, చంద్ర, సురేష్,చైతన్య, పవన్, వెంకటేష్ ,హజరత్, నాగరాజా,సునీల్,అనిల్,భాను తదితరులు పాల్గొన్నారు.