ప్రతి ఓటమి గెలుపుకు బాట వేస్తుంది-పవన్ కళ్యాణ్

హైదరాబాద్: రాజకీయ జీవితంలో ఓడిపోయానని,అయితే ఓటమి నేర్పించిన పాఠాలు భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడుతూ వైఫల్యం అన్నది విజయానికి బాట వేస్తుందని వ్యాఖ్యానించారు. తన వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ కొంత మంది ఏమీ చేయకుండా కూర్చుంటారని, తాను అలాంటి వాడిని కాదన్నారు.మార్పు కోసం తనకు వీలైనంతలో ప్రయత్నిస్తానని అన్నారు.