NATIONALPOLITICS

డాక్టర్ జకీర్ నాయక్ మాట్లాడిన దానికి ఎక్కవగా నుపుర్ శర్మ మాట్లాడలేదే-రాజ్ థాకరే

భేషరతుగా మద్దతు ఇస్తున్నాను..

అమరావతి: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి బీజెపీ నుంచి బహిష్కరించబడిన నేత నుపుర్ శర్మకు తాను భేషరతుగా మద్దతు ఇస్తున్నానని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధినేత రాజ్ థాకరే అన్నారు..మంగళవారం పార్టీ సమావేశం సందర్బంగా అయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ వంటి నేతలు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని, వారిని వదిలేసి నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు అడగడం సమంజసం కాదన్నారు..ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు? ఆమే ఏం తప్పుగా మాట్లాడలేదు కదా ? మరి జకీర్ నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు ? MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు ఎవరూ నోరు మెదపరు ? నేను నుపుర్ శర్మను మద్దతు ఇస్తున్నాను. భేషరతుగా నా సహకారం ఆమెకు ఉంటుంది’’ అని రాజ్ థాకరే స్పష్టం చేశారు..

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా రాజ్ థాకరే విమర్శలు చేస్తూ, బాలాసాహేబ్ పాటించిన విలువల్ని ఉద్ధవ్ థాకరే పాటించడం లేదని మండిపడ్డారు.. నేను శివసేనలో ఉన్నప్పుడు బాలాసాహేబ్ ఎలా వ్యవహరించేవారో నాకు తెలుసు. ఏ పార్టీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికే ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేవారు.మరి ఇలాంటి విధానం ఇప్పుడెలా మారింది ? ఎన్నికల ప్రచారంలో కూడా ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని మోదీ, అమిత్ షా స్పష్టంగానే చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఎన్నికలు ముగిశాక ఎలా వచ్చింది?’’ అని థాకరే ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *