CRIMENATIONAL

మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢికొట్టి హత్య

అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్‌కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి శుక్రవారం సాయంత్రం మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్‌లో ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు, కులకర్ణి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా,జరిగిన సంఘటన ప్రమాదం వశాత్తు జరిగింది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30 సంవత్సరాలు ఐబీలో పనిచేసిన కులకర్ణి 23 సంవత్సరాల కిందట పదవీ విరమణ చేసినట్లు మైసూరు పోలీసు కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. కులకర్ణి రోజూ సాయంత్రం వేళ నడిచే దారిలో కార్లు వంటి వాహనాలు వెళ్లవని,దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో ఢీకొట్టి హత్య చేశారని వెల్లడించారు.ఘటనకు కారణమైన కారుకు నంబర్‌ ప్లేట్లు లేవని, అయితే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీస్ అధికారి వెల్లడించారు.లోతుగా దర్యాప్తు చేసేందుకు స్పెషల్ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *