పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

అమరావతి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు అయన ప్రయాణిస్తున్న కంటైనర్ పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి బుల్లెట్ గాయాలు అయినట్లు జియోటీవీ పేర్కొంది. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలు అయినట్లు వెల్లడించింది. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్,వాజిరాబాద్ నగరంలోని అల్లావాలా చౌక్ వద్ద, ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్నకంటైనర్-మౌంటెడ్-ట్రక్కుపై కాల్పులు జరిగాయి.దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ కు నిరసన ప్రదర్శనగా వెళ్తున్నారు.ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా వున్నట్లు సమాచారం.