V.R.Law collegeలో లెక్చరర్ పై మాజీ విద్యార్ది దాడి

నెల్లూరు: గత కొన్ని సంవత్సరాల నుంచి V.R.Law collegeలో టన్నుల కొద్ది అవకతవకలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు వున్నాయి.ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలలు లేవు. ఈ నేపధ్యంలో..గురువారం V.R.Law collegeలో లెక్చరర్ పై మాజీ విద్యార్ది దాడి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్లితే… శ్యాంసుందరం అనే లా కళాశాల మాజీ విద్యార్ది,అటెండెన్స్ సర్టిఫికేట్ గురించి దౌర్జన్యం మాట్లడడం జరిగిందని,ఈ విషయంను ఖండించినందుకు తనపై భౌతికంగా దాడి చేశాడని లా కాలేజ్ లెక్చరర్ నారాయణ చెప్పారు.నేడు అయన లా కాలేజ్ ఆవరణంలో నిరసన దీక్షకు చేపట్టాడు.ఈ సందర్బంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లా కాలేజ్ లోని కొంత మంది లెక్చరర్స్,ఇలాంటి మాజీ విద్యార్దులకు వంతం పాడుతున్నరని,కాలేజ్ లోని మరొక లెక్చరర్,,,ఒక ప్రవేట్ కాలేజ్ కి సంబంధించిన విద్యార్దులతో కొంత మొత్తం నగదు అయనకు చెల్లించే విధంగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. సదరు కాలేజ్ కి సంబంధించిన విద్యార్దులకు, పరీక్ష కేంద్రంగా లా కాలేజ్ ని కేటాయించినప్పడు,ఒప్పందం కుదుర్చుకున్న లెక్చరర్,ప్రవేట్ కాలేజ్ విద్యార్దులు మాస్ కాపీయింగ్ చేసుకునేందుకు సహకరిస్తారని ఆరోపించారు.ఇలాంటి సంఘటనలను తాను నిలదీయడంతో, భరించ తనకు జరిగిన ఆన్యాయంపై జాయింట్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు.ఇందుకు జె.సి వెంటనే స్పందించారని తెలిపారు.తనపై దాడి చేసేందుకు ప్రొత్సహించిన డా.ఎన్.రవి,,డా.రామాంజనేయులు,దాడి చేసిన శ్యాంపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు నిరహారదీక్ష చేస్తానని తెలిపారు.మరి అధికారులు ఎలా స్పందిస్తారొ,వేచి చూడాల్సిందే..