అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,భారత్ పర్యటన ఖర్చు

అమరావతి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో కుటుంబ సమేతంగా భారత సందర్శనకు వచ్చిన సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి..ఈ విషయంపై మిషాల్ భతేనా అనే వ్యక్తి RTI దరఖాస్తు వివరాలు కోరగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాధానం ఇచ్చింది..కొవిడ్-19 కారణంగా సకాలంలో సమాధానం ఇవ్వలేకపోయామని వివరణ ఇచ్చింది..ట్రంప్ 36 గంటల పర్యటనకు రూ.38 లక్షలు వ్యయం అయ్యినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది..దేశాల అత్యున్నత నేతలు, ప్రతినిధుల పర్యటన ఖర్చులను ఆతిథ్య దేశమే భరించాల్సి ఉంటుందని,,అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఈ వ్యయాల భారాన్ని మోయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది..ఇందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి బస,,ఆహారం,, పర్యటన రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించిందని పేర్కొంది..పర్యాటనకు రూ.38 లక్షలు ఖర్చయ్యిందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వైకే సిన్హా తెలిపారు..ఫిబ్రవరి 24,,25-2020 తేదీల్లో 36 గంటలపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించారు..ఆయన సతీమణి మెలానియా, కూతురు,,అల్లుడు ఇవాంకా,,జారెడ్ కుష్నర్‌తోపాటు అమెరికా ఉన్నతాధికారులు పలువురు ఉన్నారు..అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో పర్యటించారు.