తిరుమల కొండపైకి ప్రయోగాత్మకంగా RTC ఎలక్ర్టిక్ బస్సు

తిరుపతి: తిరుమల కొండపైకి RTC ఎలక్ర్టిక్ బస్సు ను సోమవారం ఉదయం ప్రయోగాత్మకంగా నడిపారు..తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల 2వ ఘాట్ నుంచి కొండపైకి చేరుకుంది.తరువాత తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి,, తిరిగి మొదటి ఘాట్ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది..అలాగే సాయంత్రం రెండవ సారి ఈ బస్సును నడిపించారు.. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు..ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో..మలుపుల్లో బస్సు వేగం,ఇంజన్ లోడ్ పనితీరును అధ్యయనం చేశారు ..IIT ప్రొఫెసర్లు కూడా RTC ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్,,ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.రాబోయే వారం రోజుల్లో మరో పది బస్సులు తిరుపతికి చేరుకుంటాయని,, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని RTC అధికారులు తెలిపారు.. టికెట్ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.