INTERNATIONAL

పాకిస్తాన్ లోని మసీదులో పేలుడు-46 మంది మృతి

అమరావతి: ఆర్దిక మాంద్యతో ఆహార వస్తువులు దొరకక పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మాత్రం చేలరేగిపోతున్నారు..సోమవారం పెషావర్‌లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించగా మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు..వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు..హై సెక్యూరిటీ వున్న ఈ ప్రాంతంలోని మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలిపారు..పోలీసు అధికారి సికందర్ ఖాన్ మీడియాకు తెలిపారు..  మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించారని,,100 తీవ్రంగా గాయపడ్డారని, వీరికి ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నామని చెప్పారు..మసీదు భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయిందని, శిథిలాల క్రింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు..పోలీస్ చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మసీదు ఆఫ్ఘనిస్థాన్ సమీపంలో ఉందని,,ఈ ఘటనకు పాల్పపడిన వారి కోసం దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నయని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *