ఫించన్ల పంపిణీలో నకిలీ రూ.500 నోట్లు

అమరావత: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఫించన్ల క్రింద వాలంటీర్లు పంపిణీ చేసిన నగదులో 38 నకిలీ రూ.500 నోట్లను వచ్చాయి..రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన రూ.2750ల పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించింది..ఇందులో భాగంగా నరసాయపాలెం ఎస్సీ కాలనీలో వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసుందుకు శనివారం యర్రగొండపాలెం బ్యాంకులో పంచాయితీ కార్యదర్శి డబ్బును డ్రా చేసి వాలంటీర్లకు అందచేశారు..వాంటీర్లు, ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వెళ్లిన తరువాత లబ్ధిదారులు,వారికి ఇచ్చిన నగదులో రూ.500 నోట్లు నకిలీవిగా గుర్తించి,వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లారు..వాలంటీర్ తన దగ్గర ఉన్న నోట్లల్లో మరిన్ని నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు..పంపిణీ చేసిన మొత్తం రూ.19 వేల రూపాయల్లో నకిలీ రూ.500 నకిలీ నోట్లను తిరిగి స్వాధీనం చేసుకున్నవాలంటీర్,నకిలీ నోట్లను అధికారులకు అప్పగించారు..పోలీసులు కేసు నమోదు చేసుకొని,,నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.