అమరావతి: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) మరణించారు..దాదాపు 40 రోజులు నుంచి ఢిల్లీ AIIMSలో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ,, బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదిన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలారు..సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఢిల్లీలోని AIIMSలో చేర్పించారు..శ్రీవాస్తవకు చికిత్స అందించిన వైద్యుల బృందం ఆయనను బతికించేందుకు తీవ్రంగా శ్రమించింది..చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడు పైభాగానికి ఆక్సీజన్ అందలేదని,,ఫలితంగా శ్రీవాస్తవ స్పృహలోకి రాలేదని వైద్యులు వెల్లడించారు..1980 నుంచి రాజు శ్రీవాస్తవ వినోద పరిశ్రమలో పనిచేస్తున్నారు..2005లో రాజు శ్రీవాస్తవ స్టాండ్-అప్ కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మొదటి సీజన్‌లో పాల్గొన్న తరువాత మంచి గుర్తింపు పొందారు..‘మైనే ప్యార్ కియా’, ‘ఆమ్దానీ ఆఠాణి,,ఖర్చ రూపాయా’, ‘మై ప్రేమ్ కి దీవానీ హూన్’ వంటి అనేక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.రాజు శ్రీవాస్తవ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు,,అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi, other leaders condole comedian Raju Srivastav's demise
Read @ANI Story | https://t.co/rlb5dmTtPF#PMModi #RajuSrivastav #RestInPeace #RajuSrivastavDemise pic.twitter.com/hsyWdDtXcg
— ANI Digital (@ani_digital) September 21, 2022