వ్యవసాయ పరిశోధనా పలితాలపై రైతులకు అవగాహన కల్పించాలి-కలెక్టర్

నెల్లూరు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీ పై అందచేసే వినూత్నమైన వ్యవస్థను తీసుకురావడం జరిగిందని కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.శుక్రవారం నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటుచేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సందర్బంలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పధకాన్ని ప్రవేశపెట్టి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖచ్చితమైన భూమి హద్దులు, కొలతలతో పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 57 గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూ రీ సర్వే కార్యక్రమం పూర్తి కావడం జరిగిందని, జిల్లా మొత్తం భూ రీ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి రైతులకు కొత్త భూ హక్కు పత్రాలను అందించడం జరుగుతుందన్నారు. పరిశోధనశాలల్లో జరిగే పరిశోధనా పలితాలపై రైతులకు అవగాహన కల్పించి వాటిని రైతులకు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ అధికారులపై వుందన్నారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకొని, గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి, పంటను నిలచేసుకోవడానికి జిల్లాలో 78 గోడౌన్లు మంజూరు కాగా, ఆ గోడౌన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డా. యు. వినీత, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.