CRIMEHYDERABAD

E-స్కూటర్స్ గొడౌన్ లో ఘోర అగ్రిప్రమాదం-8 మంది మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..దట్టమైన కెమికల్స్ పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో రూమ్స్ తీసుకున్న 8 మంది ట్యూరిస్టులు మరణించారు..వీరిలో 5 గురు అక్కడికక్కడే మరణించగా మరో 3 గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు..మరణించిన వారిలో 7 గురు పురుషులు,, 1 మహిళ ఉన్నారు..వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని తెలుస్తుంది..మరో 10 మంది తీవ్ర గాయాలు కావడంతో,వీరికి అసుపత్రిలో చికిత్స అందిస్తూన్నారు.. మోండా మార్కెట్‌ పోలీసుల స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు వివరాలు ఇలా ఉన్నాయి..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం కొనసాగుతోంది..సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గొడౌన్ ఉంది..పైన వున్న 4 అంతస్థుల్లో రూబీ లాడ్జీ నడుస్తొంది..సోమవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ లేక (E-స్కూటర్‌ ఓవర్ చార్జీ కారణంతొనో) ఓ E-స్కూటర్‌(ఎలక్ట్రిక్) బ్యాటరీ పేలిపోయింది..చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపించడంతో, మరో 10 స్కూటర్స్ బ్యాటరీలు పేలిపోయాయి..ఇదే సమయంలో పైన వున్న లాడ్జీలోని 23 రూమ్స్ లో దాదాపు 25 మంది వరకు ట్యూరిస్టులు వున్నారు..అందరూ ఏ.సి లు ఆన్ చేసి వుండడంతో బయట శబ్దాలు వీరికి పెద్దగా విన్సించలేదు..రూబీ లాడ్జీలోకి వెళ్లాలన్న,,బయటలకు రావలన్న వుండేది ఒకే మార్గం..అంత ఇరుకుగా ఈ లాడ్జీ వుంటుంది.. E-స్కూటర్ల బ్యాటరీలు పేలిపోయిన ఘటన వల్ల వ్యాపించిన మంటలు,,కెమికల్ పోగ బయటకు వెళ్లె దారి లేకపోవండంతో,,లాడ్జీలోని రూమ్స్ లోకి వ్యాపిచింది..రూమ్స్ లో వుంటున్న వారు తేరుకునే లోపు,,కెమికల్ పొగ వల్ల ఉపిరి అడక క్యారిడర్ లోనే సృహా తప్పి పడిపోయి మరణించారు..అలాగే వేగంగా మంటలు వ్యాపించడంతో,,దిక్కుతోచని స్థితిలో కొందరూ లాడ్జీ పై నుంచి దూకివేశారు..వీరికి తీవ్రగాయాలు అయ్యియ..మిగిలిన వారు సహాయం కోసం కేకలు వేస్తుండి పోయారు..ఆ ప్రాంతంలో వున్న స్థానికులు కొందరు వెంటనే స్పందించి,,నిచ్చెనల సాయంతో కొంత మంది క్రిందకు దించారు..పోలీసులకు,,ఫైర్ డిపార్టమెంట్ కు సమాచారం అందించారు..దాదాపు 45 నిమిషాల తరువాత కాని ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతంకు చేరుకోలేక పోయాయి..లాడ్జీ ప్రాంతంక చేరుకున్న 8 ఫైరి ఇంజన్లు మంటలను అదుపు చేశారు..అయితే అప్పటికి జరగాల్సి ప్రాణ నష్టం జరిగిపోయింది..

సంఘటన స్థలంకు చేరుకున్న సీటీ కమీషనర్ సి.వి.ఆనంద్ పరిస్థితిని పరివేక్ష్యిస్తున్నారు..అలాగే లాడ్జీ ఓనర్ రంజిత్‌సింగ్‌ బగ్గాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరణించిన వారిలో విజయవాడకు చెందిన ఎ.హరీశ్‌,, చెన్నైకి చెందిన సీతారామన్‌,, దిల్లీ వాసి వీతేంద్రలుగా ఉన్నట్లు గుర్తించగా,,మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది..

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ :- సంఘటన గురించి తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు..మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ,,మరణించిన వారికి రూ.2 లక్షలు,,గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *