అమరావతి: కేరళలో బుధవారం ఆర్దరాత్రి సమయంలో పాలపక్కడ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. తమిళనాడులోని ఊటీ వైపు విహారయాత్రకు వెళ్లుతున్న టూరిస్ట్ బస్సు,కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 విద్యార్థులు,1 టీచర్, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు ఉన్నారు. ఎర్నాకుళం జిల్లా బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన వీరు ఊటీ వెళ్లుతున్నారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు,, కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా, అదుపు తప్పిన టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టి, రోడ్డుపక్కన ఉన్న కాల్వలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 49 మంది ఉన్నారని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని,,క్రేన్ సహాయంతో టూరిస్టు బస్సును పైకిలేపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం చేస్తున్నామని కేరళ మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు.