నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం-40 మంది మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
అమరావతి: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది..ఆదివారం దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న యెతీ ఎయిర్‌లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు.. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం..పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది..ఈ విషయాన్ని యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు..ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది..
నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇచ్చిన సమాచారం మేరకు,,ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 10.33 గంటలకు ఖాట్మాండు నుంచి టేకాఫ్ తీసుకుంది..పోఖారా ఎయిర్ పోర్టులో మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా, సేతి నది ఒడ్డున ఒక్కసారిగా కుప్పకూలింది..విమానం ఖాట్మాండు నుంచి పోఖారా చేరుకునేందుకు 25 నిమిషాల సమయం పడుతుండగా,,ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను చూస్తే విమానంలో ఎవరూ బతికే అవకాశంలేదని అధికారులు అంటున్నారు..ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 40 మంది మరణించగా,,18 మృతదేహాలను వెలికితీశారు..