అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో శనివారం వేకువజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కన్వర్ ఆరుగురు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. హత్రాస్ పరిధిలోని సదాబాద్ దగ్గర జరిగిందీ ప్రమాదం..కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్ కు బయలుదేరి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామం వద్ద వేగంగా వస్తున్న ట్రక్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది…దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా,,మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు..బాధితులు అందరూ మధ్యప్రదేశ్ పరిధిలోని గ్వాలియర్ కు చెందిన వారిగా గుర్తించారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు..ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు..ట్రక్ డ్రైవర్ గురించి సమాచారం అందిందని,, త్వరలోనే అరెస్టు చేస్తామని ఆగ్రా జోన్ DGP రాజీవ్ కృష్ణ తెలిపారు..