అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్‌వేపై సోమవారం వేకువ జామున 4 గంట సమయంలో అగివున్నప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీ కొనడంతో 6 మంది మరణించాగా 18 మంది గాయపడ్డారు..ఈ సంఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్ పూర్ గ్రామ సమీపంలో జరిగింది.. రెండు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రక్కన అగివున్న UP 81 DT 1580 బస్సును,, UP 17 AT 1353 వొల్వో బస్సు వేగంగా వచ్చిన ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు,ఒక చిన్న బిడ్డ వున్నారు.. సమాచారం అందుకు ఏఎస్పీ మనోజ్ పాండే ఘటన స్థలం వద్దకు చేరుకుని,,క్షతగాత్రులను చికిత్స కోసం లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు..ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తన ప్రగాఢ సంతాపం తెలిపారు.