డోనాల్డ్ ట్రంప్ ఇంటిపై FBI అధికారుల దాడులు-కీలక పత్రాలు స్వాధీనం

అమరావతి: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,,2020లో జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI రంగంలోకి దిగింది..ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫ్లోరిడాలోని ట్రంప్ ఫామ్ హౌస్, రిసార్ట్ మార్-ఎ-లిగోలో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు..FBI ఏజెంట్లు ట్రంప్ ఇంటిని వారీ ఆధీనంలోకి తీసుకున్నారు..దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు ఎలాంటి సమాచారాన్ని బయటికి రాకుండా జాగ్రత్తతీసుకుంటు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్త సంస్థలు పేర్కొంటున్నాయి.. అధికారిక ప్రకటన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశముంది..ఇప్పటికే ట్రంప్ ఇంటి నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. FBI తనిఖీలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు..మార్-ఎ-లెగోలోని పామ్ బీచ్‌లోని తన నివాసంపై సోదాలు చేసేందుకు FBI తన నివాసంను వారీ స్వాధీనంలోకి తీసుకుందని తెలిపారు..FBI చర్య రాజకీయ ప్రతీకారమేనని,,అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడి చేయడం అమెరికాకు గడ్డు కాలమన్నారు..పెద్ద సంఖ్యలో FBI ఏజెంట్లు తన ఇంటిని చుట్టుముట్టారని,,ఇది దేశానికి చీకటి సమయం అంటూ ట్రంప్ మండిపడ్డారు..దర్యాప్తు సంస్థకు తను తన వంతు సహకారం అందిస్తున్నప్పటికీ,,ముందస్తూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన నివాసంపై దాడి చేశారని ట్రంప్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే డెమొక్రాట్ల దాడే అంటూ ట్రంప్ విమర్శించారు.. FBI దాడుల సమయంలో ట్రంప్ ఇంట్లో లేరని,,ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉన్నట్లు వార్త సంస్థలు పేర్కొంటున్నాయి..