ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయండి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ ముద్దాడ రవిచంద్ర, కమిషనర్ శ్రీనివాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆస్పత్రుల్లో పనిచేస్తూ మరణించిన, ఉద్యోగానికి రాజీనామా లేదా పదవీ విరమణ చేసిన వారిని గుర్తించి, ఆ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్వో పెంచలయ్య, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజు, ఎసి సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ పాల్గొన్నారు.