రేపటి నుంచి సినిమా షూటింగులు బంద్-దిల్ రాజు

హైదరాబాద్: అగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది..తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి ఆగస్టు 1వ తేది నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నమని నిర్మాత దిల్ రాజు తెలిపారు..ప్రస్తుతం దాదాపు 30 సినిమాల షూటింగ్స్ రన్నింగ్ లో ఉన్నాయని,,రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవన్నారు..అన్నీ సమస్యలను పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు..మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది 24 క్రాప్ట్స్ మాట్లాడిన తరువాత వెల్లడిస్తామని దిల్ రాజు తెలిపారు..