హైదరాబాద్: అడ్డదారుల్లో గల్ఫ్ దేశాలకు యువకులను పంపిస్తున్నముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.గురువారం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి అని,,ఒకసారి రిజెక్టైన యువకులు అడ్డదారిలో మళ్లీ వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఫింగర్ ప్రింట్ సర్జరీని ఆశ్రయిస్తున్నారన్నారు..సర్జరీ జరిగిన 3 నెలల తర్వాత కువైట్ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని,,అక్కడి వెళ్లిన తర్వాత ఇమ్మిగ్రేషన్ లో దొరికిపోతుండటంతో వారికి కువైట్ లో 7 రోజుల జైలు శిక్ష అనంతరం తిరిగి భారత్ కు పంపిస్తున్నారని వెల్లడించారు..ఈ కొత్త తరహా మోసం గురించి కువైట్ ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కమీషనర్ పేర్కొన్నారు..ఎక్స్ రే టెక్నీషియన్ నాగ మహేశ్వర్ రెడ్డి,,ఆనస్థీసియా టెక్నీషియన్ వెంకటరమణ,,శివ శంకర్ రెడ్డి,, రామకృష్ణారెడ్డి ముఠాగా ఏర్పడి యువకులను తప్పుదారి పట్టిస్తున్నరని చెప్పారు..కడపకు చెందిన వ్యక్తికి శ్రీలంకలో ఫింగర్ ప్రింట్ సర్జరీ చేయించుకున్నాడన్న సమాచారం అందడంతో,,రాచకొండ పోలీసులు టీమ్ లను రంగంలోకి దించడం జరిగిందన్నారు..తాజాగా హైదరాబాద్ ఘట్ కేసర్ లో ఒక వ్యక్తికి ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసేందుకు డాక్టర్ రాగా,,అతన్నిఅదుపులోకి తీసుకోవడం జరిగిందని,,వీళ్లు ఒక్కో ఫింగర్ ప్రింట్ సర్జరీకి డాక్టర్లు రూ.25వేలు చెల్లిస్తున్నట్లు సీపీ చెప్పారు..కేరళలో ఆరుగురు, రాజస్థాన్ లో ఇద్దరితో పాటు కడపకుచెందిన మరో ముగ్గురికి ఈ సర్జరీ చేసినట్లు గుర్తించారు..ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ చేయించుకున్న మరో ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసినట్లు సీపీ ప్రకటించారు.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు చెప్పారు.