తిరుపతిలో తొలి లిథియం సెల్ తయారీ కేంద్రం-కేంద్ర మంత్రి

తిరుపతి: భారతదేశం 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదని ఉద్ఘాటిస్తూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం అందరి భాగస్వామ్యంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నారని అన్నారు.ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్రాల సమన్వయంతో లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో మునోత్ ఇండస్ట్రీస్, భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రంను చంద్రశేఖర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ “ఈ పుణ్యభూమి అయిన తిరుపతి – శ్రీవేంకటేశ్వరుని నివాసస్థలం కావడం గౌరవం విశేషం.అది కూడా మన గౌరవ ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజుకి ఒకరోజు ముందు నేను ఇక్కడ ఉండడం ఆనందం.నాకు వ్యక్తిగతంగా తిరుపతి EMCలో భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారంలో ఉండటం చాలా హర్షనీయమన్నారు..