NATIONAL

పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలపై దృష్టి సారించాలి-ప్రధాని

నీతి అయోగ్ సమావేశం..

అమరావతి: పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు.. అదివారం దిల్లీ రాష్ట్రపతి భవన్​ సాంస్కృతిక కేంద్రంలో నీతి అయోగ్ ఏడవ పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు..ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్​ గవర్నర్లు హాజరయ్యారు..జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య అమలు,, జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య,, పట్టణ పాలన దృష్టి కేంద్రికరించాలని ప్రధాని కోరారు..కొవిడ్​ సంక్షోభం సమయంలో,,భారత సహకార సమాఖ్యవాదం, సమాఖ్య నిర్మాణం ప్రపంచ దేశాలకే నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు..ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సూచనలు చేశారు..సమావేశం ఆర్ధవంతంగా జరిగిందని,,NEP 2020,G-20, ఎగుమతుల ప్రాధాన్యంపై చర్చ జరిగిందని నీతి ఆయోగ్​ CEO పరమేశ్వరన్​ అయ్యర్​ తెలిపారు..కొవిడ్​ సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని,, 2047 లక్ష్యాల గురించి ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *