ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షరాలు సోనియా

అమరావతి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో బుధవారం చేరారు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న అమె ఆసుపత్రిలో చేరినట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి..గత సంవత్సరం జూన్‌లో సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు..జూన్ 12న సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందిన అమె,జూన్ 20న డిశ్చార్చి అయ్యారు..అటు తరువాత పోస్ట్ కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు..కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు.. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించిన సమయంలో రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.