అమరావతి: వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు మోసపూరితంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ICICI మాజీ CEO చందాకొచ్చార్,, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను CBI అరెస్ట్ చేసింది. దీపక్ కొచ్చర్ కంపెనీ “న్యూ పవర్ రెన్యువబుల్”కు, వీడియోకాన్ గ్రూపునకు మధ్య క్విడ్ ప్రొ కో జరిగిందని,, దీపక్ కంపెనీలో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టిందని అభియోగాలు వచ్చాయి..వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణం తరువాత కాలంలో నాన్-ఫెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారిపొయింది..ఈ వ్యవహారంను “బ్యాంకు మోసం”గా పరిగణించారు. సెప్టెంబరు 2020లో దీపక్ కొచ్చర్‌ను ED అరెస్ట్ చేసింది. చందా కొచ్చర్ సారథ్యంలోని ICICI బ్యాంక్, వీడియోకాన్ గ్రూపుకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది.. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సుప్రీం ఎనర్జీ.. న్యూపవర్ రెన్యువబుల్ కంపెనీలో రూ.64 కోట్ల పెట్టుబడులు పెట్టింది..ఈ సంస్థలో దీపక్ కొచ్చర్‌కు 50 శాతం వాటా ఉంది.