రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ

నెల్లూరు: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీ సమేతంగా, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,అబ్దుల్ అజీజ్ తో కలసి బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తదితరులు పాల్గొన్నారు.