జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో చికిత్స పొందుతూ మృతి

అమరావతి: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై శుక్రవారం ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు..జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం షింజో అబే సేవలు అందించారు..2006లో ఆయన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..2020లో అనారోగ్య సమస్యలతో ఆయన పదవి నుండి వైదొలిగారు..ఇక షింజోపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు..కాల్పులు జరిపిన వ్యక్తి,,నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు సమాచారం..యమగామి 2002 నుంచి 2005 వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసినట్లు తెలుస్తోంది..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది?
ప్రధాని మోదీ:- జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం సేవలందించిన షింజో అబే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నేతను ప్రపంచం కోల్పోయిందని..ఇది మాటల్లో చెప్పలేని విషాదం అంటూ ట్వీట్ట్ చేశారు.షింజో మృతికి నివాళిగా కేంద్రం రేపు సంతాపదినంగా ప్రకటించింది.