10వ తరగతి పరీక్షల్లో ఇక నుంచి 6 పేపర్లే

అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది..2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలు చేయాలని గతంలో ఇచ్చిన జీవో MS NO 82ను సవరిస్తూ ఉత్తర్వులు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ జారీ చేశారు..గతంలో 11 పేపర్లు ఉండగా, కోవిడ్ కారణంగా మధ్యలో 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది.ప్రస్తుతం CBSC సిలబస్ దృష్ట్యా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.. ఫిజిక్స్,బయలాజికల్ సైన్స్ కు ఒకే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానం తెచ్చామని,,సంవత్సర అంతా పరీక్షలు జరపడం వల్ల 11 పేపర్లు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన్నట్లు సమాచారం.