అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది ప్లేయర్లు పాల్గొంటుండగా తొలిసారి మహిళలు కూడా పాల్గొటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్మీ, నేవీ, పోలీస్ విభాగల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఫిట్-ఇండియా ఉద్యమంను ప్రేరణగా తీసుకుని, ఐరన్‌మ్యాన్ 70.3 గోవాను 2019లో తొలిసారి ప్రారంభించారు..అటు తరువాత కొవిడ్-19 కారణంగా రెండు సంవత్సరాల పాటు ఈవెంట్ ను రద్దు చేశారు. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ పోటీల్లో 1450 మంది ఔత్సహికులు పాల్గొటున్నారు. ఐరన్‌మ్యాన్ 70.3 గోవా ఈవెంట్ లో 1.9 కిలోమీటర్ల స్విమింగ్,, 90 కిలోమీటర్ల సైక్లింగ్,, 21 కిలోమీటర్ల రన్సింగ్ పోటీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు ఎంపీ తేజశ్ సూర్య పాల్గొన్నారు.ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఫిజికల్ ఫిట్ నెసే కాకుండా మానసిక ఉల్లాసంగా ఉంటుందన్నారు.
Visit to @IIMNagpurIndia pic.twitter.com/7IeLUiTkP4
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) November 12, 2022