CRIMEHYDERABAD

గోవా డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్-కమీషనర్ చక్రవర్తి

హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాలకు, గోవా కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ ను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫీయా డాన్,జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు వివరాలు జాన్ స్టీఫెన్ డిసౌజా కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయని  గుర్తించినట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. హైదరాబాద్ లోని కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలను వెల్లడిస్తూ,ఈ జాబితలో 168 మంది హైదరాబాద్ కు చెందిన వారే అని తెలిసిందన్నారు.. గోవా లో డ్రగ్స్ కింగ్ పిన్ గా జాన్ స్టీఫెన్ డిసౌజా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని, హిల్ టాప్ రెస్టారెంట్ లో అతడి డ్రగ్స్ స్థావరం ఉందన్నారు.1983 నుంచి ఆ రెస్టారెంట్ ను జాన్ స్టీఫెన్ డిసౌజా నిర్వహిస్తున్నాడని, ప్రతి శుక్రవారం అక్కడ స్పెషల్  పార్టీలు జరుగుతాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా ఉంటుందని, ట్రాన్స్ మ్యూజిక్, టెక్నో మ్యూజిక్ లతో పార్టీ లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. జాన్ స్టీఫెన్ డిసౌజాకు చెందిన ఏజెంట్లు డ్రగ్స్ ను, ఆ రెస్టారెంట్ కు వచ్చే టూరిస్ట్ లకు అమ్ముతుంటారని,వీటిని కొనుగొలు చేసి యువత వినియోగిస్తుంటారని చెప్పారు.ఈ కేసులో మరో ఆరుగురు పరారీ లో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడ కాకతీయ నగర్ లో నివాసం వుంటున్న, గోవాకు చెందిన కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే,జాన్ స్టీఫెన్ డిసౌజా పేరుతో పాటు మరో ఏడుగురి పేర్లు వెల్లడించడని సీ.పీ పేర్కొన్నారు. కాళీ అందించిన సమాచారం ఆధారంగానే గోవాకు వెళ్లి ఆపరేషన్ చేశామన్నారు. గోవా పోలీసుల సహకారంతో జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్ చేశామని చక్రవర్తి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *