36 ఏళ్ల తరువాత 70 అడుగలను దాటిన గోదావరి

హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది..32 సంవత్సరాల తరువాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది.. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరుకుంది.. గత 50 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు తాకింది.. ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది..ఇంకా వరద నీరు వచ్చినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల దృష్ట్య అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్ జోన్‌గా ప్రకటించారు.. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి..రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది..2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.. (1986 ఆగష్టు 16వ తేదిన భధ్రాచలం వద్ద 75.6 అడుగులను తాకింది..అటు తరువాత 1990 ఆగష్టు 24వ తేదిన 70.8 అడుగులను చేరుకుంది.)
Godavari water level has touched a high of 70 ft at 2.30 pm. #Bhadrachalam #TelanganaFloods pic.twitter.com/8MqZ30vpAO
— Inspired Ashu. (@Apniduniyama) July 15, 2022