తిరుమల శ్రీవారికి రూ.1.30 కోటి విలువైన స్వర్ణాభరణాలు విరాళం

తిరుమల: తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు కెఆర్.నారాయణమూర్తి, అయన సతీమణి కెఎన్.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు.ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో(FAC) అనిల్ కుమార్ సింఘాల్‌కు అందించారు.దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. గత సంవత్సరం డిసెంబరులో కెఆర్.నారాయణమూర్తి ,,సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.