రాష్ట్రంలో రూ.6.7 కోట్ల విలువైన బంగారం సీజ్

అమరావతి: రాష్ట్రంలో పెద్ద మొత్తంలో బంగారం,నగదు పట్టుబడింది.గురువారం నాడు ప్లాష్ రైడ్స్ చేయడంతో రూ.11 కోట్లు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి,ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ట్రైయిన్స్ లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, చిలకలూరిపేట,చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న ఒక వ్యక్త వద్ద దాదాపు 5 కే.జీల బంగారం దొరికింది. మరి కొంత మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేయగా వీరి వద్ద కూడా బంగారం దొరికింది.మొత్తం రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.