అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తొంది-మంత్రి కాకాణి

జడ్పీ సర్వసభ్య సమావేశం..
నెల్లూరు: జిల్లా పరిషత్ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా, ఫలప్రదంగా జరిగేందుకు అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కారించి సభపై నమ్మకం, విశ్వాసం కలిగించాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అనేకం జరుగుతున్నాయని, కొంతమంది కావాలని దృష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి వాటిని తిప్పికొట్టేందుకు ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తామంతా పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తొలుత జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. సభలో ప్రధానంగా ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన నగదు, చెరువుల మరమ్మత్తులు, పూడికతీత, చెరువుల్లో అక్రమంగా మట్టి తరలింపు, రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు, జల్ జీవన్ మిషన్, పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనులు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తదితర అంశాలపై చర్చించారు.