శీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్

తిరుమల: తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శీవారిని దర్శించుకున్నారు.గవర్నరుకు ఆలయ మహాద్వారం వద్ద టిటిడి ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులం వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందజేశారు.ఈ సందర్భంగా రాత్రి నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేశామని గవర్నరుకు ఈఓ వివరించారు. టిటిడి నిర్ణయం చాలా బాగుందని, అందుబాటులోకి వచ్చిన అదనపు సమయంలో ఎక్కువమంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని గవర్నర్ ప్రశంసించారు.