DISTRICTS

సంచార రేషన్ పంపిణీ వాహనాల ద్వారా గిరిజిన ఉత్పత్తులు-జె.సి

తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా చౌకధరల దుకాణాలు,,సంచార రేషన్ పంపిణీ వాహనాల ద్వారా వివిధ గిరిజిన కోఆపరేటివ్ కార్పొరేషన్,,ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ ఫెడరేషన్,,మార్క్ ఫెడ్ ఉత్పత్తులను తక్కువ ధరలకే రేషన్ కార్డుదారులకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినదని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. దీని ద్వారా అటు కార్డుదారులకు లబ్ది చేకూరడంతో పాటు చౌకధరల దుకాణాదారులకు,సంచార రేషన్ పంపిణీ వాహనా నిర్వాహకులకు కుడా ఆర్ధికంగా మేలు చేకూరుతుందని వెల్లడించారు. అదే సమయం లో గిరిజన ఉత్పత్తులను సేకరించి గిరిజిన కోఆపరేటివ్ కార్పొరేషన్ కు అందించే గిరిజనులకుకూడా మార్కెటింగ్ సదుపాయం ఏర్పడి ఆర్ధికంగా చేయూత లభిస్తుంది.ఈ పధకంలో భాగంగా మొదటి దశలో నవంబర్ 1వ తారీకు నుంచి విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో పైలట్ పధకముగా ప్రారంభించబడుతుందన్నారు. తదుపరి అన్ని జిల్లాలకు విస్తరించండం జరుగుతుందన్నారు. ఈ పధకం ద్వారా అమ్మే సరుకులు నాణ్యమైనవి అయి ఉండాలి,, ఇవి ఈ మూడు సంస్థలు జారీ చేసే సరుకులను మాత్రమే వినియోగదారులకు విక్రయించవలని,, వేరొక సంస్థ సరుకులను విక్రయించరాదని వెల్లడించారు. ఈ రెండు సంస్థలు జారీ చేసే సరుకుల సంబంధిత ధరల పట్టికను వినియోగదారులకు తెలిసే విధముగా ప్రదర్శించవలని,, ఏ సరుకుల పైనను కుడా నిర్ణయించిన ధర కన్నా ఒక్క రూపాయి కూడా వినియోగదారుల నుండి తీసుకోనరాదని స్పష్టం చేశారు.

ఈ పధకం ద్వారా వినియోగదారులకు మొదటగా గిరిజిన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులైన… నాణ్యమైన తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, వివిధ రకాల ఆయుర్వేదిక సబ్బులు, నాణ్యమైన చింతపండు, కుంకుడికాయపొడి,,శీకకాయపొడి, కారంపొడి, పసుపుపొడి, కుంకుమ మొదలగునవి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.తదుపరి ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ ఫెడరేషన్ ఉత్పత్తులైన పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాయిన్ ఆయిల్,,వేరుశనగ నూనె అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *