బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ముంబై- అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దేశం కలల కన్న ప్రాజెక్ట్ ఇది అని ఈ సందర్భంగా బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది..జాతీయ ప్రాముఖ్యత,, ప్రజా ప్రయోజనాల కోసమే బుల్లెట్ ట్రైన్ అని పేర్కొంది..ముంబైలోని విక్రోలి ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం,,NHSRCL ప్రారంభించిన భూసేకరణకు వ్యతిరేకంగా గోద్రెజ్ అండ్ బోయ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది..ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, ప్రజా సంక్షేమం కోసమేనని కోర్టు వ్యాఖ్యనించింది..ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనదని, ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది..రైల్వే శాఖ త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కి.మీ రైలు మార్గంలో దాదాపు 21 కి.మీ భూగర్భంలో ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు..గత సంవత్సరం అక్టోబర్‌లో కంపెనీకి రూ.264 కోట్ల పరిహారంచెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం, కోర్టుకు తెలియచేసింది..