హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది..ఈ నెల 25వ తేది నుంచి ప్రాధాన్య క్రమంలో సినిమా షూటింగ్స్‌కు అనుమతిస్తామని నిర్మాతలు దిల్ రాజు, సి కల్యాణ్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టాలీవుడ్‌లో ఈనెల 1వ తేది నుంచి నిర్మాతల సమస్యల పరిష్కారానికి వీలుగా షూటింగ్స్‌ను నిలిపివేయడం జరిగిందన్నారు..కరోనా తరువాత మారిన పరిస్థితులు, పెరిగిన బడ్జెట్లు,కనీస వేతనాలు పెంచాలని టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు సమ్మెకు దిగిన నేపథ్యంలో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ అపివేసిందన్నారు..చర్చల్లో భాగంగా ఓటీటీల్లో సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగిందని,,సినిమా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని వెల్లడించారు.. గత 23 రోజులుగా మా సమస్యలు ఏంటి అనేవి చర్చిస్తున్నాం. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. సెప్టెంబర్1వ తేదిన నుంచి షూటింగ్స్ ప్రారంభిస్తున్నాం. మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అగ్రిమెంట్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం.ఆగస్ట్ 30న మా తుది నిర్ణయాన్ని ఫిలిం ఇండస్ట్రీకి వెల్లడిస్తాం. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యసర్లకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. నిర్మాతలందరం అన్ని శాఖల్లోని సమస్యలపై చర్చిస్తున్నాం. ఇప్పటికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, మరో 2 రోజుల్లో మిగతా నిర్ణయాలు చెబుతామన్నారు..అలాగే థియేటర్, మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు,స్నాక్స్ ధరలను ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.