BUSINESSNATIONAL

ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే GST వర్తిస్తుంది-నిర్మలా సీతారామన్‌

లూజ్‌గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు..

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ GSTపై ట్వీట్టర్ లో మంగళవారం కీలక ప్రకటన చేస్తూ,,ప్యాకేజీ ఫుడ్స్‌,, ఆసుపత్రి బెడ్స్‌ పై 5% GST విధించడంపై గందరగోళం నెలకొనడంతో,GST వర్తించని  కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. ప్రీప్యాకింగ్‌ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే GST వర్తిస్తుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా ఓట్స్,, మొక్కజొన్న,,బియ్యం,, పప్పు,, బియ్యం,,రవ్వలు,,సెనగపిండి,,పెరుగు,,లస్సీ,,మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా,,ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు..ఇవే ఉత్పత్తులను  విడిగా,, ప్యాక్ చేయకుండా  విక్రయిస్తే  GST వర్తించదని ఆర్థికమంత్రి పేర్కొన్నారు..లూజ్‌గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు అంటూ  14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్‌ చేశారు.  లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై GST ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. గత నెలలో GST కౌన్సిల్‌ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *