అసంపూర్తిగా ముగిసిన GST కౌన్సిల్ సమావేశం

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన 48వ GST కౌన్సిల్ సమావేశం వీడియో కార్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎలాంటి నిర్ణయాలు లేకుండానే అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో కేవలం 15 అంశాలపైనే చర్చలు జరిగాయని,, సమయాభావం కారణంగా మరికొన్ని అంశాలపై చర్చించలేదని అధికారులు వెల్లడించారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సును ఈ సమావేశంలో చర్చంచలేదు. ఈ సమావేశానికి రెండు రోజుల ముందు నివేదిక సమర్పించడం వల్ల దీనిపై చర్చ జరగలేదని ఉన్నతాధికారులు తెలిపారు. పప్పుల పొట్టుపై GST తగ్గింపును ప్రకటించారు. పొట్టుపై పన్ను 5 శాతం నుంచి సున్న శాతంకు తగ్గింది. ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి GSTని తగ్గించారు. GSTని ఎగ్గొట్టే సంస్థలకు భారీగా జరిమానా విధించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.కొత్త ట్యాక్స్ లకు సంబంధించి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.