ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా సోమవారం నార్త్,,సెంట్రల్ గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు ఈనెల 1వ తేదిన జరిగిన విషయం విదితమే. గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాధరణ ఓటర లాగే క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు వేశారు.ఎగ్జిట్ పోల్స్ ఆంచనాల ప్రకారం మళ్లీ బీజెపీనే అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తుంది.